జనసేన సిద్ధాంతాలే నాకు స్ఫూర్తి – డేగల నాగేంద్ర
కాజులూరు, పెన్ పవర్, మే 25: రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన జనసేన యువనేత డేగల నాగేంద్ర ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఆనందంలో నాగేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని ఆశీర్వాదాలు పొందిన నాగేంద్ర, “మీ ఆశీస్సులతో పార్టీకి మరింత సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నాను. మీరు మాకు ధైర్యం… మీరు చూపే మార్గమే మా ప్రయాణం” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు యువతలో స్ఫూర్తిని నింపుతున్నాయని, ఆయన మాటలు తమలాంటి కార్యకర్తలకు ఉత్తేజాన్ని ఇస్తున్నాయని నాగేంద్ర పేర్కొన్నారు. “మిమ్మల్ని కలిసిన తర్వాత నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను” అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

పార్టీ కోసం సొంత ఖర్చులతో సేవలు
డేగల నాగేంద్ర ఇప్పటికే జనసేన పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తూ సొంత ఖర్చులతో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ జిల్లా స్థాయి సమావేశాలకు హాజరవుతున్నారు. పార్టీ పెద్దలతో నిరంతరం టచ్‌లో ఉంటూ యువతను, జనసైనికులను, వీర మహిళలను సమన్వయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

నాగేంద్ర తన ప్రత్యేక శైలిలో అందరినీ కలుపుకుపోతూ, చిరునవ్వుతో పలకరిస్తూ “సేవే లక్ష్యం – పార్టీనే ప్రధానం” అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఆయన రాజకీయ దూకుడు మరింత పెరిగిందనే చర్చ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
పవన్‌పై అభిమానాన్ని చాటిన నాగేంద్ర
ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నాగేంద్ర తన మిత్రబృందం, జనసైనికులు, వీర మహిళలతో కలిసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నారు.
“ప్రజాసేవకే నా ప్రాధాన్యత”
పార్టీ అవకాశం ఇస్తే ప్రజలకు మరింత చేరువై సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నాగేంద్ర తెలిపారు. “పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉంటే నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని స్పష్టం చేశారు.
పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగేంద్ర, యువతలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి అండగా నిలిచిన ఆయన, రామచంద్రపురం నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న యువనేతగా గుర్తింపు పొందుతున్నారు.
ప్రత్యేక కథనం-పెన్ పవర్ ప్రతినిధి,దడాల ఏడుకొండలు.

