ePaper
Saturday, May 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువంచుల తాజా మాజీ సర్పంచ్ దంపతులను ఘన సన్మానం  

వంచుల తాజా మాజీ సర్పంచ్ దంపతులను ఘన సన్మానం  

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 7:మండలంలోని వంచుల పంచాయతీ చెరపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ వనపల కాసులమ్మ, ఆమె భర్త వైసీపీ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడు రాజేష్ దంపతులను వైసీపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాసులమ్మ మాట్లాడుతూ సర్పంచ్‌గా తన ఐదేళ్ల పదవీకాలంలో తనకు అండదండలు అందించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, వైసీపీ నాయకులు, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులను కూడా సన్మానించారు. కార్యక్రమానికి లొంజా గణపతి, పి.గంగరాజు, అరడ సత్తిబాబు, మాజీ ఉపసర్పంచ్ శ్రీధర్, జానకిరామ్, బంగారు రాజు, సుదర్శన్, చిట్టిబాబు, జోగిరాజు, లక్ష్మణరావు, శ్రీను, కొర్ర రఘునాథ్, కృష్ణంరాజు, కృష్ణమూర్తి, కొమ్ములు, మాజీ వార్డు సభ్యులు సోములమ్మ, కవడం ఈశ్వరమ్మ, వంతల చిలకమ్మ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular