
కాజులూరు, పెన్ పవర్, మే1:
కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం శివాలయం ప్రాంగణంలో శుక్రవారం కాజులూరు మండల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై డాక్టర్ డేగల నాగేంద్ర ప్రధాన అతిథిగా హాజరై, తన ఆధ్వర్యంలో సభ్యులతో ప్రమాణ పత్రం (రి.నెం: 101/2026) చదివించి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆలయ ప్రాంగణంలో సమిష్టిగా ప్రమాణ పత్రాన్ని చదివి విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం సభ్యులందరినీ డాక్టర్ నాగేంద్ర శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.జర్నలిస్టులకు అవసరమైన సేవా కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం అవుతానని, ఎలాంటి ఆపద వచ్చినా యూనియన్ సభ్యులకు అండగా ఉంటానని డాక్టర్ నాగేంద్ర భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వీరవల్లి గణపతి, జనరల్ సెక్రటరీ దడాల ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ అనసూరి శ్రీనివాస్, ట్రెజరర్ కేశన గంగరాజు, జాయింట్ సెక్రటరీ తోట శివ, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు అత్తిలి వెంకటరమణ, పోతుల సత్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందు డాక్టర్ డేగల నాగేంద్రకు యూనియన్ సభ్యులు ఘన స్వాగతం పలికి, అనంతరం సాలువతో సత్కరించారు.

