ఐదు ఏళ్లుగా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని కాలయాపన చేస్తున్న అధికారులు.
గర్భిణీ స్త్రీ సుందరమ్మకు కుర్చీలో మోస్తూ గేదెలబంద జంక్షన్ తీసుకొచ్చిన వైనం.
ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:మండలంలో గల కరిముఖిపుట్టు పంచాయతీ, బరెంగుల గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ వంతాల సుందరమ్మకు నెలలు నిండడంతో రహదారి సౌకర్యం లేక కుర్చీలో మోస్తూ సుమారు రెండు కిలోమీటర్ల వరకు తరలించి తరువాత 108 వాహనముతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాల ప్రకారం.. వంతాల సుందరమ్మకు పురిటి నొప్పుల రావటంతో 108 వాహనానికి ఫోను ద్వారా సంప్రదించగా గ్రామానికి వాహనం రావాలంటే రహదారి సౌకర్యం లేకపోవడంతో గేదెలబంధ జంక్షన్ వరకు వాహనం వచ్చాయి. దీంతో అక్కడి వరకు గ్రామస్తులు చేసేది లేక ఓ కుర్చీలో కూర్చోబెట్టి నిండు గర్భిణి సుందరమ్మకు గేదెలబంద జంక్షన్ వరకు తీసుకుని వచ్చి 108 వాహన సహాయంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గత ఐదు సంవత్సరాలుగా రోడ్డు వేస్తామని సంబంధించిన శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పటం వరకే జరుగుతుంది గానీ రోడ్డు సౌకర్యం కల్పించడం విఫలమవుతున్నారనీ, రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు ఏళ్ళుగా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని సంబంధించిన అధికారులు మట్టి రోడ్డు వేసి అసంపూర్తిగా విడిచి పెట్టారని, అనారోగ్యాల బారిన పడిన వారిని, గర్భిణీ స్త్రీలను ఆసుపత్రి తరలించాలన్న 108 వాహనం రాలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గేదలబంధ జంక్షన్ నుండి తక్షణమే భరింగుల గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు సంబంధించిన అధికారులకు ప్రభుత్వానికి కోరుచున్నారు. గత ఐదేళ్ల క్రితం రోడ్డు సౌకర్యం కల్పనకు అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, రోడ్డు పనులు ప్రారంభించి అసంపూర్తిగా విడిచిపెట్టారని, దీంతో డోలిమోతలే గత్యంతరమనీ గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే బరెంగుల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు.

