Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుస్వీయ గణనపై ఉపాధి వేతనదారులకు అవగాహన

స్వీయ గణనపై ఉపాధి వేతనదారులకు అవగాహన

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్‌ 20: స్వీయ గణన పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జీకే వీధి తహశీల్దార్ అన్నాజీరావు సూచించారు. మండలంలోని రింతాడ పంచాయతీ ముల్లుమెట్ట గ్రామంలో సోమవారం ఉపాధి హామీ వేతనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జనగణన వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే విధానంపై వివరణ ఇచ్చారు.ఈ విధానం ద్వారా జనగణన ప్రక్రియ సులభతరం అవుతుందని పేర్కొన్నారు.ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, అవసరమైన మార్గదర్శకాలను అధికారులు అందిస్తారని తెలిపారు.కార్యక్రమంలో ఏపీఓ రాంప్రసాద్ మండల సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular