ePaper
Wednesday, April 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుదామనపల్లి స్వర్ణ గ్రామం కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రదర్శన.. పేరు పరిశీలించుకోవాలని సూచన

దామనపల్లి స్వర్ణ గ్రామం కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రదర్శన.. పేరు పరిశీలించుకోవాలని సూచన

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ కేంద్రంలోని స్వర్ణ గ్రామం కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బాలరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా సవరణలు అవసరమైతే అధికారులకు వెంటనే తెలియజేయాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండటం బాధ్యతగా భావించి రాబోయే ఎన్నికల్లో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, సతీష్, గౌరీశంకర్, కుందేరి నాగరాజు, డిజిటల్ అసిస్టెంట్ బేరా సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular