Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిరూ.1.1 కోట్ల విలువైన 220 కిలోల గంజాయి స్వాధీనం

రూ.1.1 కోట్ల విలువైన 220 కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్ , మరో ఐదుగురు పరారీ 

రెండు కార్లు సీజ్

రావికమతం, పెన్ పవర్ :

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్‌చార్జి డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్ ఆదేశాల మేరకు, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు పర్యవేక్షణలో రావికమతం పోలీసులు భారీ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. గుడివాడ జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, మారుతి ఎర్టిగా, టాటా కర్వ్ కార్లను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.1 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఘటనలో గంజాయి సరఫరాదారు కిల్లో తిమోతి, కొనుగోలుదారు షేక్ మహమ్మద్ రఫీ, కారు డ్రైవర్ షేక్ ఫయాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉండగా, వారితో పాటు తమిళనాడుకు చెందిన గంజాయి రిసీవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ మేరకు రావికమతం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.52/2026 కింద ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. భారీ గంజాయి రవాణా ముఠాను పట్టుకోవడంలో సమయస్ఫూర్తి ప్రదర్శించిన రావికమతం ఎస్సై ఎం. రఘువర్మ, బుచ్చయ్యపేట ఎస్సై పి. మనోజ్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్ మీడియా సమావేశంలో అభినందించి నగదు రివార్డులు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular