ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన

📰 Generate e-Paper Clip

 

ఎంఈఓ మల్లేశ్వరరావు

గంగవరం పెన్ పవర్

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన కొనసాగుతుందని మండల విద్యాశాఖ అధికారి టి మల్లేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని గొర్రగొమ్మి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయుడు కారం వెంకటేశ్వర్లు దొర అధ్యక్షతన నిర్వహించగా ఎంఈఓ మల్లేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి విద్యాభివృద్ధికై ప్రభుత్వం అమ్మ ఒడి మధ్యాహ్నం భోజన పథకం వంటి సౌకర్యాలతో పాటు ఉచితంగా యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ తో పాటు షూస్ బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో విద్యా బోధన సాగుతుందన్నారు.

పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు అలాగే ఈ ఏడాది విద్యా సంవత్సరంలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ రాజారెడ్డి , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular