ePaper
Friday, April 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజురింతాడ సమీపంలో రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి

రింతాడ సమీపంలో రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18:జీకేవీధి మండలం పరిధిలోని రింతాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కొయ్యూరు మండలానికి చెందిన దొండపందిరి విష్ణు (యువకుడు) తన స్నేహితుడితో కలిసి శుక్రవారం రాత్రి చింతపల్లి ముత్యాలమ్మ జాతరకు హాజరయ్యాడు.జాతర అనంతరం తెల్లవారుజాము తిరిగి రింతాడలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా, ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కింద పడ్డారు.ఈ ప్రమాదంలో విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విష్ణుని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular