ePaper
Thursday, June 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంరాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

 

 

గంగవరం, పెన్ పవర్, జూన్ 17: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం ఆముదాలబంధ పంచాయతీ పరిధిలోని రాజంపాలెం గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలు వైద్యం కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాలకే వైద్య సేవలను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.గంగవరం మండలంలో ఈ నెలలో షెడ్యూల్ ప్రకారం ఏడు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజంపాలెం గ్రామంలో జరిగిన శిబిరాన్ని మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ ఆధ్వర్యంలో నిర్వహించగా, గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుంజం వెంకటేశ్వర్లు దొర, కుంజం కృష్ణమూర్తి, కుంజం రామకృష్ణ, డాక్టర్ నిఖిత్, జీఎఎన్‌ఎం చిట్టి, ఫార్మసిస్ట్ స్వర్ణ, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు శ్రీకాంత్, కందుల సాయి, సిబ్బంది నాని, ఆశా వర్కర్ పి. చంద్రకళతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular