ePaper
Monday, April 27, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంసరివేల గ్రామంలో గ్రామ పెద్దల సమావేశం 

సరివేల గ్రామంలో గ్రామ పెద్దల సమావేశం 

📰 Generate e-Paper Clip

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26:

 

తుమ్మల పంచాయితీ పరిధిలోని సరివేల గ్రామంలో గ్రామ పెద్దలు, పూజారులు, పటేళ్ల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి పోడియం లక్ష్మణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కోయ సమాజ్ ఆదివాసి నాయకులు కట్టం సీతారామయ్య, సుక్మా జిల్లా నాయకులు సోయం నగేష్ పాల్గొని మాట్లాడారు. గ్రామ పెద్దలు, పూజారులు, పటేళ్లకు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తూ మా ఊరిలో మా రాజ్యం అనే నినాదాన్ని ప్రస్తావించారు. గ్రామస్థులు చట్టాలపై అవగాహనతో బలంగా ఉండాలని సూచించారు. కోయ, కొండరెడ్డి, నాయకపోడు వంటి గిరిజన తెగల సంస్కృతి, భాష, సంప్రదాయాలు, ఆచారాలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన భూములు ఇతరులకు చెందకుండా కాపాడాలని, అన్యాక్రాంత భూములను తిరిగి గిరిజనులకు అప్పగించాలని కోరారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం గ్రామసభకు నిర్ణయాధికారం ఉందని, మద్యం దుకాణాల అనుమతుల విషయంలో కూడా గ్రామసభ తీర్మానం అవసరమని వివరించారు. పేషా చట్టం, పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి తక్కువగానే ఉందని, ప్రజాప్రతినిధులు, విద్యావంతులు చట్టాలపై అవగాహనతో ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సరివేల గ్రామ పటేల్ ముర్రం మల్లయ్య, కారం శంకరం, ఆదివాసి నాయకురాలు బుర్ఖాన్‌కోట పటేల్ ఎం. జోగయ్య, వెంకటాపురం పటేల్ బ్రహ్మయ్య, నారాయణపురం పటేల్ కిట్టయ్య, ఎర్రగుట్ట సురేష్ (పెస కమిటీ అధ్యక్షులు) తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular