ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఒక ఖాకీ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది..?

ఒక ఖాకీ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది..?

సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తండ్రి–కొడుకుల మృతికి బాధ్యులైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడం కీలక మలుపు అయింది. సహచరుల బెదిరింపులను లెక్కచేయకుండా న్యాయం కోసం నిలిచిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోర్టు ఇచ్చిన రక్షణతో ఆమె చూపిన తెగువ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సాత్తాన్‌కుళం కేసులో చారిత్రాత్మక తీర్పు
9 మంది పోలీసులకు ఉరిశిక్ష
రేవతి సాక్ష్యం కేసులో కీలకం
బెదిరింపుల మధ్య న్యాయం కోసం పోరాటం
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ

న్యూస్ డెస్క్ పెన్ పవర్ , ఏప్రిల్ 09 :

తమిళనాడును కుదిపేసిన సాత్తాన్‌కుళం తండ్రి–కొడుకుల లాకప్ డెత్ కేసులో మధురై ఫస్ట్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో జయరాజ్, బెన్నిక్స్‌ల కస్టడీ మృతికి బాధ్యులైన 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. “రేర్‌స్ట్ ఆఫ్ రేర్” కేసుగా పరిగణించిన న్యాయస్థానం, చట్టాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఉల్లంఘించారని తీవ్రంగా వ్యాఖ్యానించింది.

ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన సాక్ష్యం కీలక ఆధారంగా నిలిచింది. సహచరుల నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గకుండా నిజాలను కోర్టు ముందు ఉంచారు. దీంతో విచారణకు బలమైన మద్దతు లభించి నిందితులపై అభియోగాలు మరింత బలపడ్డాయి. విచారణ సమయంలో రేవతి భద్రతపై కూడా కోర్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. సాక్షుల రక్షణకు న్యాయస్థానం తీసుకున్న చర్యలు కేసు తీర్పులో ప్రధాన పాత్ర పోషించాయి. రేవతి ధైర్యం లేకపోతే ఈ కేసులో న్యాయం ఆలస్యం అయ్యేదని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడీ తీర్పుతో పాటు రేవతి చూపిన నిబద్ధత సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. పోలీసు వ్యవస్థలో నుంచే నిజం వైపు నిలిచి న్యాయం కోసం పోరాడిన ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తూ, ఇది కస్టోడియల్ హింసకు వ్యతిరేకంగా బలమైన సందేశమని పేర్కొంటున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular