ePaper
Tuesday, May 26, 2026
ePaper
Homeజాతియంఈవీఎంలపై అప్రమత్తంగా ఉండండి :మమతా బెనర్జీ

ఈవీఎంలపై అప్రమత్తంగా ఉండండి :మమతా బెనర్జీ

📰 Generate e-Paper Clip

“ఈసారి నిరంకుశ బీజేపీకి బెంగాల్ గట్టిగా బుద్ధి చెబుతుంది”
బరసత్, బసిర్‌హట్ సభల్లో మమతా ఫైర్…
ఓటర్ల జాబితా, ఈవీఎంలపై సంచలన ఆరోపణలు
బరసత్ సభలో మమతా బీజేపీపై విరుచుకుపాటు
“బెంగాల్ గెలుస్తుంది” అంటూ మహిళల నినాదాలు
మోదీ-షాపై మమతా ఘాటు విమర్శలు
ఓటర్ల జాబితాల తొలగింపుపై సంచలన ఆరోపణలు
ఈవీఎంలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీకి పిలుపు

న్యూస్ డెస్క్  పెన్ పవర్| ఏప్రిల్ 11: 

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వరూప్‌నగర్, బసిర్‌హట్, బరసత్ ప్రాంతాల్లో జరిగిన భారీ సమావేశాల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందనను ఉద్దేశించి మాట్లాడుతూ, “నిరంకుశ శక్తులను ఓడించేందుకు బెంగాల్ ప్రజలు పూర్తిగా సిద్ధమయ్యారు. ఈసారి బీజేపీని ఘోరంగా ఓడిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. బరసత్ కచేరీ మైదానంలో వేలాది మహిళలు ప్లకార్డులు పట్టుకుని “బెంగాల్ గెలుస్తుంది” అంటూ నినాదాలు చేయడం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల మద్దతు తనకు మరింత ధైర్యం ఇచ్చిందని మమతా పేర్కొన్నారు. అలాగే  నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల సమయంలో మాత్రమే బెంగాల్‌పై ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. “సోనార్ బంగ్లా అంటూ హామీలు ఇస్తూ, మరోవైపు బెంగాలీ మాట్లాడిన వారినే వేధిస్తున్నారు” అంటూ కాషాయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాల నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగించారంటూ మమతా సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో పేర్లు తొలగించారని, అందులో బెంగాల్‌కు చెందిన ఓటర్లూ ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఇక ఎన్నికల రోజున ఈవీఎంలను తారుమారు చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ, పార్టీ కార్యకర్తలు ప్రతి ఈవీఎంను నిశితంగా గమనించాలని పిలుపునిచ్చారు. బయటి రాష్ట్రాల వ్యక్తులు అక్రమంగా ఓటు వేయకుండా పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మమతా తాజా వ్యాఖ్యలతో బెంగాల్ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular