ePaper
Tuesday, May 26, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంరంపచోడవరం నూతన డీఎస్పీగా అషరఫ్ అలీ నియామకం

రంపచోడవరం నూతన డీఎస్పీగా అషరఫ్ అలీ నియామకం

📰 Generate e-Paper Clip

 

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 11:
పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్‌కు నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అషరఫ్ అలీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఈ యువ పోలీసు అధికారి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పోలీసు విభాగంలోకి ప్రవేశించారు.
కడప జిల్లాకు చెందిన అషరఫ్ అలీని రంపచోడవరం డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా రంపచోడవరం ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత బలపడుతుందని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, ఇంతకుముందు రంపచోడవరం డీఎస్పీగా పనిచేసిన జి. సాయి ప్రశాంత్ బదిలీ అనంతరం, చింతూరు ఏఎస్పీ హేమంత్ తాత్కాలికంగా ఇన్‌చార్జి డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన డీఎస్పీ అషరఫ్ అలీ త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular