ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్బస్సు కిందకు బైక్ , బైక్ మీద ఉన్న వ్యక్తి మృతి

బస్సు కిందకు బైక్ , బైక్ మీద ఉన్న వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 :  

చిలకలూరిపేట : పేటలో పెళ్లింట పెను విషాదం నెలకొంది. కృష్ణారెడ్డి డొంక ప్రాంతానికి చెందిన షేక్ బాజీ (45) తన అన్న కుమారుడి వివాహ పత్రికలు ఇచ్చి బైక్‌పై తిరిగి వస్తుండగా, ఎన్టీఆర్ కాలనీ సమీపంలో మృత్యువు కబళించింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బైక్ స్కిడ్ అవ్వడంతో, అదే సమయంలో వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందారు. రెండు రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో ఈ ఘోర ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular