చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 :
చిలకలూరిపేట : పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో నర్సారావుపేట రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఒక మోటార్ సైకిల్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.

