ePaper
Sunday, May 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుప్రజల సహకారంతో అల్లూరి జిల్లాను ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ నిషాంతి.టి

ప్రజల సహకారంతో అల్లూరి జిల్లాను ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ నిషాంతి.టి

📰 Generate e-Paper Clip

స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, మే 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ (SA-SA) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ లక్ష్యంగా గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిషాంతి టి తెలిపారు. శనివారం పాడేరు మండలం కిండంగి గ్రామంలో తడి, పొడి చెత్తతో ఏర్పాటు చేసిన సంపద సృష్టి కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం వీఆర్ కళ్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, క్లాక్ మిత్రులు, ఎఫ్‌పీఓలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పరిశుభ్రమైన, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లాను ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలిగించని, పునరుత్పాదక ఇంధన వినియోగం, వ్యర్థాల పునర్వినియోగం చేపట్టే గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం, పారిశ్రామిక మరియు గృహ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. తడి, పొడి చెత్తతో పాటు కాఫీ వ్యర్థాల ద్వారా వర్మి కంపోస్ట్ తయారీ చేపట్టి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో వర్మి కంపోస్ట్ వినియోగాన్ని ప్రోత్సహించి, వాటి ద్వారా లభించే ఆదాయాన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ప్రతి నెల మూడో వారంలో నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత 16 నెలలుగా 16 అంశాలపై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో విజయవాడ సీపీఆర్ కమిషన్ సీఈవో వెంకటేశ్వరరావు, జీసీసీ డైరెక్టర్ బొర్ర నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్పీవో, ఇతర జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, క్లాక్ మిత్రులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular