* దివ్యాంగురాలిపై ప్రధానోపాధ్యాయుడు దురుసు ప్రవర్తనతో విద్యార్థిని కుటుంబం ఆవేదన.
* అవమానంతో స్వగ్రామానికి వెనుదిరిగిన విద్యార్థిని స్వాతి, వారి పేరెంట్స్.
* పాఠశాలల్లో చేర్చుటకు నిరాకరణపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్న విద్యార్థిని తండ్రి కొర్ర లైకోన్.
* లక్ష్మీపురం పంచాయతీ మాజీ సర్పంచ్ కొర్ర త్రినాథ్.
ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 17.
మూగ, చెవిటి విద్యార్థినీగా ఉండటంతో పాఠశాలకు చేర్చుటకు నిరాకరించిన అమానుష ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలంలో చోటుచేసుకుంది. ముంచంగిపుట్టు మండలం, లక్ష్మీపురం పంచాయతీ మాజీ సర్పంచ్ కొర్ర త్రినాథ్ మంగళవారం పాత్రికేయులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలో గల జోలపుట్టు పంచాయతీ కేంద్రంలోనీ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల ఇంగ్లీషు మీడియం పాఠశాలలో మూగ, చెవిటి కారణం చూపి విద్యార్థినీకు జాయినింగ్ చేయని ప్రధాన ఉపాధ్యాయుడు సిరిగం. గున్నయ్యపై చర్య తీసుకోవాలనీ లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కొర్రా త్రినాధ్ డిమాండ్ చేశారు. మాటలు రానీ మూగ, వినిపించని చెవిటితో ఉన్న దానికి నా పాఠశాలలో జాయినింగ్ కు అవకాశం లేదని, ఏటిడబ్ల్యు కాదు కదా కలెక్టర్ చెప్పిన చేర్చుకోనని విద్యార్థిని తండ్రిపై ఉపాధ్యాయుడు దమ్మయించారన్నారు. సోమవారం జోలాపుట్ పాఠశాలలో ఆరవ తరగతికి జ్వాయినింగ్ నిమిత్తం కొర్ర స్వాతి అనే దివ్యంగ విద్యార్థిని తన తండ్రి కొర్ర లైకోన్ తీసుకెళ్లారని, ఈ నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయుడు అవహేళన చేస్తూ మాటలు రానీ మూగ దానికి జాయినింగ్ చేయాలని అడిగే వారికి బుద్ధి ఉండాలని, ఒకవేళ పాఠశాలలో చేర్పించిన ఎటువంటి ప్రయోజనం లేదని వెటకారంగా మాట్లాడారని విద్యార్థిని తండ్రి కొర్ర లైకోన్ తెలిపినట్లు త్రినాధ్ తెలిపారు. దీంతో చేసేది లేక అవమానంతో ఊరిలో వెళ్లిపోయారనీ అన్నారు. మంగళవారం జాయినింగ్ విషయంపై ఏటిడబ్ల్యుఓ స్వర్ణలతకు ఫోన్ ద్వారా సంప్రదించగా.. ఎందుకు జ్వాయినింగ్ చెయ్యరనీ, తప్పకుండా జ్వాయినింగ్ చేస్తారనీ, అలాంటి వారికే మొదటి ప్రాధాన్యత ఉంటాయని, మీరు ఇపుడే వెళ్ళాలని సూచించారన్నారు. దీంతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని పేరెంట్స్ తో ప్రధానోపాధ్యాయుడు గున్నయ్య వెటకారంగా మాట్లాడారనీ అన్నారు. ఈ విషయంపై తాను ప్రధాన ఉపాధ్యాయుడు సిరిగం గున్నయ్యకు ఫోన్ ద్వారా సంప్రదించగా కొర్రా స్వాతికి జాయినింగ్ చెయ్యమనీ అన్నారన్నారు. ఎటిడబ్ల్యుఓ మాట్లాడారు కదా అని అడిగితే ఏటిడబ్ల్యు కాదు కదా కలెక్టర్ చెప్పిన జాయినింగ్ చేసేది లేదనీ, మాటలు రాని మూగదానికి, వినిపించని చెవిటి దానికి జ్వాయినింగ్ చేసిన మాత్రాన ప్రయోజనం ఏమిటని దురుసుగా ఎగతాళిగా మాట్లాడి కించపరచారన్నారు. పేద పివిటిజి విద్యార్దినీ స్వాతికి జాయినింగ్ చేయలేదు సరి కదా..మానసికంగా కించపరిచి దూషించిన గున్నయ్యపై జిల్లా కలెక్టర్ కు, పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తామని త్రీనాథ్ తెలిపారు. గ్రామంలో ఐదవ తరగతి వరకు చదువుకున్న స్వాతి విద్య పట్ల ఆసక్తి కలిగి ఉందని, దివ్యాంగ విద్యార్థిని అయినప్పటికీ చదువు పట్ల మక్కువ చూపటంతో పాఠశాలలో చేర్పించుటకు తీసుకెళ్లరన్నారు. సమాజంలో దివ్యాంగులపై ఇటువంటి వివక్ష చూపటం సరికాదని, స్వాతికు పాఠశాలలో చేర్పించకపోవడంపై స్వాతి మానసిక క్షోభకు గురయినట్లు త్రినాథ్ వెల్లడించారు. కాగా ఈ విషయంపై పాత్రికేయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గున్నయ్యకు వివరణ కోరగా.. విద్యా అభ్యసనలో విద్యార్థిని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల దృష్ట్యా చేర్పించుటకు నిరాకరించినట్లు తెలిపారు. ప్రత్యేకమైన పాఠశాలలు ఉన్న నేపథ్యంలో ఆ పాఠశాలలోనే చేర్పిస్తే బాగుంటాదనే ఉద్దేశంతో చెప్పామని, తప్పని పరిస్థితుల్లో ఇక్కడే చదువుకుంటామంటే జాయినింగ్ చేస్తామనీ ప్రధానోపాధ్యాయుడు వివరణ ఇచ్చారు.

