Homeతెలంగాణభక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు

 

గార్ల, పెన్ పవర్, జూలై 25:

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల వ్యాప్తంగా ఆషాఢ మాసం తొలి ఏకాదశి (శయన ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం నాడు ఆయా వైష్ణవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో మండలంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. మండల కేంద్రంలోని స్థానిక జెండా బజార్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అచ్యుత్ చార్య స్వామి అమ్మవార్లకు విశేష పూజలతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, ప్రత్యేక అలంకరణ, వేద పారాయణం ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక అలంకరణలో స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పరుచూరి కుటుంబరావు భజన బృందం సభ్యులు జక్కుల పాండురంగారావు రమేష్ బాబు రంగారావు శ్రీనివాస్ బేతి వెంకటేశ్వర్లు మహిళలు భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular