Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుపిడుగుపాటుకు ముక్కలు చెక్కలుగా చీలిపోయిన వృక్షం

పిడుగుపాటుకు ముక్కలు చెక్కలుగా చీలిపోయిన వృక్షం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్ 4: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీకేవీధి మండలం మొండి గెడ్డ పంచాయతీ పరిధిలోని మొండికోట గ్రామ శివారులో బుధవారం పిడుగుపాటుకు భారీ సిల్వర్ ఓక్ వృక్షం విరిగి పడింది.పిడుగు తీవ్రతకు వృక్షం పూర్తిగా చీలిపోయి ముక్కలు చెక్కలై చెల్లాచెదురుగా పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు, ప్రజలు వర్షాల సమయంలో చెట్ల కింద నిలవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular