ePaper
Thursday, June 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు

నర్సీపట్నంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్ :

గత ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండు సంవత్సరాలు అయ్యిందంటూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అనకాపల్లిజిల్లా, నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ శాంతియుత ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అబీద్ సెంటర్ నుండి పాల్గాట్ సెంటర్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకొని, అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కొద్దిసేపు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో వైయస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నప్పటికీ, చంద్రబాబు మాయమాటలు నమ్మి మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఓట్లు వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు, ఇప్పుడు మొఖం చాటేస్తున్నారని అన్నారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు మాటలు విని మోసపోయిన వారందరూ నిలదీయాలని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు తప్ప ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. వాలంటీర్ల జీతాలు 10 వేలకు పెంచుతానని మాయ మాటలు చెప్పారని, ప్రభుత్వం వచ్చాక ఉన్న వాలంటీర్లను తొలగించారని ఆక్షేపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు మూడుసార్లు పెంచి ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమం చేశారని ఎద్దేవా చేశారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 72 కోట్లు, ఆడబిడ్డ నిధి కింద 324 కోట్లు, తల్లికి వందనం కింద 51 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద 84 కోట్లు, కౌలు రైతులకు 25.24 కోట్లు, 50 ఏళ్లకే పెన్షన్ వాగ్దానం ద్వారా 201.50 కోట్లు ఇలా పలు వాగ్దానాల ద్వారా నర్సీపట్నం ప్రజలకు అయ్యన్నపాత్రుడు 700 కోట్లకు పైగా బాకీ ఉన్నారని లెక్కలు చెప్పారు. అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అయ్యన్నపాత్రుడులను ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏక శివప్రసాద్, రూరల్ పార్టీ అధ్యక్షుడు చినబాబు, చింతకాయల వరుణ్ , కోనేటి రామకృష్ణ, మాకిరెడ్డి బుల్లిదొర, మళ్ల గణేష్, బేతిరెడ్డి విజయ్ కుమార్, చీటీల రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular