Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం

ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్

గొలుగొండ, పెన్ పవర్ :

అమలు కాని హామీలతో గత ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి రెండేళ్లయిన వాటిని అమలు చేయకపోగా, కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. మంగళవారం గొలుగొండలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతల మోసాన్ని గ్రామ గ్రామాల్లో విరివిగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12న నర్సీపట్నంలో తలపెట్టిన నిరసన ర్యాలీని భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారీగా నిరసన ర్యాలీలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వంలో కదలిక తెద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జలపు మణికుమారి, గొలుగొండ మండలం పార్టీ అధ్యక్షుడు కొరుప్రోలు ఫాణి శాంతారం, లోచలపు సుజాత, కుంచం లక్ష్మీనారాయణ, జక్కు అప్పలస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular