ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజులాటరైట్ మైనింగ్‌కు పేసా గ్రామసభ వ్యతిరేక తీర్మానం

లాటరైట్ మైనింగ్‌కు పేసా గ్రామసభ వ్యతిరేక తీర్మానం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్ 02: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస గ్రామపంచాయతీ పరిధిలోని డోకులూరు దానులవీధిలో నిర్వహించిన రంపుల పెసా గ్రామసభలో లాటరైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పెసా ఉపాధ్యక్షులు కొర్రా బాలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెసా కార్యదర్శి గెమ్మెల దొరబాబు అజెండాను చదివి వినిపించారు.డోకులూరు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 01(పి)లో 11.370 హెక్టార్ల భూమిలో రూ.100 లక్షల వ్యయంతో బుక్క రాజేంద్రప్రసాద్‌కు మంజూరు చేసిన లాటరైట్ ఖనిజ తవ్వకాల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని రంపుల, డోకులూరు, కోకితపాడు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏ మైనింగ్ ప్రాజెక్టు చేపట్టాలన్నా పెసా చట్టం–1996, అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం గ్రామసభ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గ్రామసభ పేర్కొంది. గ్రామసభను సంప్రదించకుండా ఇచ్చిన మైనింగ్ అనుమతులు చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణారావు, ఆల్ ఆదివాసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, ఆదివాసీ స్వయంపాలన సాధన కో-ఆర్డినేటర్ సుర్ల అప్పారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమేష్ కుమార్, చాపరాతిపాలెం పెసా ఉపాధ్యక్షులు జయరామ్‌తో పాటు పద్మ శ్రీను, కోటిబాబు,ఈ మూడు గ్రామాల పెద్దలు భాస్కర్ రావు,విరోజీ, కేశభద్ర,ఆనంద్ జి. అప్పారావు,జి భాస్కరరావు, జి కృష్ణ, జి సత్యనారాయణ,ఎల్ భీమరాజ్,ఆనంద్ రావు పి.మోహన్,పి ప్రసాద్,పి రాజేష్, వి.లక్ష్మణరావు,డి. సత్తిబాబు,ఎల్.కృష్ణ,ఎల్ మల్లేష్ జె బుజ్జిబాబు,జి బాబురావు, జి కృష్ణ, జి బుజ్జిబాబు, జి భాస్కరరావు,ఎల్ భీమరాజు,జి బాలరాజు, జి శంకర్,జి ఆనందరావు,జి. సత్యనారాయణ,జి.సంతోష్ రాజ్ మూడు గ్రామాల పెద్దలు, మహిళలు, యువత, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular