చింతూరు, పెన్ పవర్, 20:
చింతూరు మండలంలో గల గొర్రెల గూడెం గ్రామం లో జాతీయ రహదారి 30పై కూనవరం వెళ్లే క్రాస్ రోడ్డు సమీపంలో బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు ఎండ, వర్షాలకు రక్షణ లేక రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో బస్ షెల్టర్ నిర్మించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

