Homeఆంధ్రప్రదేశ్గంజాయి రవాణాదారులపై రూరల్ పోలీసుల కఠిన చర్యలు : పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద నిందితుడి...

గంజాయి రవాణాదారులపై రూరల్ పోలీసుల కఠిన చర్యలు : పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద నిందితుడి అరెస్ట్

చిలకలూరిపేట , పెన్ పవర్, జూలై 16:

చిలకలూరిపేట: గంజాయి రవాణాపై పల్నాడు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు నేతృత్వంలోని బృందం అక్రమ రవాణాదారులపై నిఘా తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో, రెండు అంతకంటే ఎక్కువ కేసులు నమోదై సమాజానికి ముప్పుగా మారిన ముఠా సభ్యులను గుర్తించి, పీఐటీ ఎన్డీపీఎస్ (PIT NDPS Act – 1988) చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటోంది.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కి నిందితుడు

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, గతంలో చల్లా గోపిపై చర్యలు తీసుకున్న పోలీసులు, తాజాగా కారసాని శివప్రసాద్ రెడ్డి (అలియాస్ ప్రసాదరెడ్డి) అనే గంజాయి విక్రయదారుడిని అరెస్ట్ చేశారు. ఇతనిపై నమోదైన నేర చరిత్రను పరిశీలించిన ప్రభుత్వం, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో డిటెన్షన్‌లో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. జులై 15న సీఐ బి. సుబ్బానాయుడు, రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని జైలుకు తరలించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular