గూడెంకొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 19: మన్యం ఆరాధ్య దైవం దారాలమ్మ తల్లి సన్నిధిలో ‘ధీర ధాత్రి’ నూతన చిత్రానికి బుధవారం శ్రీకారం చుట్టారు. దారకొండ శ్రీ దారాలమ్మ ఆలయ ప్రాంగణంలో కంభంపాటి ఫిల్మ్స్ ప్రొడక్షన్ పతాకంపై కంభంపాటి విజయ్‌కుమార్ నిర్మాతగా, సలాది నబిన్ పవన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.ముహూర్తపు సన్నివేశానికి చిత్ర బృందం క్లాప్ కొట్టగా, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్ర స్క్రిప్ట్‌ను దైవసన్నిధిలో ఉంచి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌కుమార్ మాట్లాడుతూ వైవిధ్యమైన కథాంశంతో, ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. దర్శకుడు సలాది నబిన్ పవన్ మాట్లాడుతూ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి మంచి సహకారం లభిస్తోందని చెప్పారు.ఈ నెల 24 నుంచి గూడెంకొత్తవీధి, కొయ్యూరు, చింతపల్లి పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. వంశీ కథానాయకుడిగా, మహిత చౌదరి కథానాయికగా పరిచయం కానున్నారు. రవికిరణ్ బోయిదాపు ఛాయాగ్రహణం, జె.కె.మూర్తి కళా దర్శకత్వం, సుభాష్ సంగీతం అందించనున్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గొర్లే వీర వెంకట్, సుర్ల వీరేంద్రకుమార్, పాత్రికేయులు సాయం రమణ, మాదిరి చంటిబాబు, సాగిన లక్ష్మణరావు, చిత్ర బృందం సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
దారాలమ్మ తల్లి సన్నిధిలో ‘ధీర ధాత్రి’ సినిమా షూటింగ్ శ్రీకారం
RELATED ARTICLES

