గార్ల, పెన్ పవర్, జూలై 31:
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ,రైతు సంఘం,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగష్టు 10న తల పెట్టనున్న జైల్ భరో కార్యక్రమoలో రైతులు,కార్మికులు, కర్షకులు, ప్రజలు, ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ కోరారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక మంగపతి రావు భవనంలో వీ.పి వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఆయా సంఘాల మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో సాదుల శ్రీనివాస్ మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చి తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుతో రైతులపై అదనపు భారం పడుతుందని, వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు.రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు పెంచడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ బిల్లు సవరణ వల్ల రైతులకు కరెంట్ బిల్లులు పెరిగి భారం అవుతుందని,ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచొద్దని డిమాండ్ చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేదని ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల రైతులు తీవ్రoగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో రైతు సంఘo జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతి,రైతు సంఘం మండల కార్యదర్శి గడ్డి పాటి రాజారావు,ఆయా సంఘాల నాయకులు మల్లెల నాగమణి,చింత మౌనిక,సి హెచ్. ఎల్లయ్య, టి. రమా,ఎ. రామకృష్ణ,వి. కొండయ్య,తదితరులు ఉన్నారు.

