ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో ఉత్సాహంగా 5కే రన్, వాక్‌థాన్, సైక్లింగ్ ర్యాలీ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31 : ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పార్క్ హోటల్ జంక్షన్ నుంచి తెన్నేటి పార్క్ వరకు నిర్వహించిన 5కే రన్, వాక్‌థాన్, సైక్లింగ్ చైతన్య ర్యాలీలు ఉత్సాహంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి షాప్ చైర్మన్ రవినాయుడు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు ర్యాలీలో పాల్గొని యువత, క్రీడాకారులు, ప్రజలకు ఆరోగ్యకర జీవనశైలి, శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఈ చైతన్య ర్యాలీలో క్రీడాకారులు, విద్యార్థులు, సైక్లింగ్ ఔత్సాహికులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

