Homeతెలంగాణప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 16:

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గార్ల ఎంపీడీవో ఎం. మంగమ్మ కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.గార్ల మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా సమర్పించవచ్చన్నారు.ప్రజల నుంచి అందే వినతులను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు 24 శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలతో నిర్దేశిత సమయంలో వినతులు సమర్పించాలని సూచించారు.మండల ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం పొందాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular