Homeతెలంగాణనేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 16:

గార్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామంలో 33 కెవి లైన్ లో టవర్లు ఏర్పాటు కొరకు సోమవారం ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు సత్యనారాయణపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని ముల్కనూరు మద్దివంచ,పెద్ద కిస్టాపురం, చిన్న కిస్టాపురం అంజనాపురం, సీతంపేట, శేరి పురం, అంకన్న గూడెం గ్రామాలకు విద్యుత్ మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈ మధు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు వ్యాపారస్తులు విద్యుత్ అసౌకర్యాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular