Homeతెలంగాణముత్తితండా సమస్యలు పరిష్కరించాలి

ముత్తితండా సమస్యలు పరిష్కరించాలి

గార్ల పెన్ పవర్ ఆగస్టు 14:

ముత్తితండా గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ముత్తితండా గ్రామ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందజేశారు.గ్రామంలో సైడ్‌ కాలువలు నిర్మించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, చెరువు కట్టపై నుంచి గ్రామానికి రహదారి నిర్మించాలని కోరారు. అలాగే చెరువు కట్ట వద్ద కల్వర్టు నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ముత్తితండా నుంచి పోచారం గ్రామానికి రహదారి నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు.గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కందునూరి శ్రీనివాస్ అలవాల సత్యవతి సంగు నాగరాజు నాగేశ్వరరావు ముత్తి తండా  గ్రామస్తులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular