గార్ల, పెన్ పవర్, ఆగస్టు 25:
గార్ల మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ పార్వతి హతిరాం నాయక్ పాల్గొని చౌక ధరల దుకాణం 03 పరిధిలోని 45 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని, కొత్త కార్డులు వాటర్ ప్రూఫ్ తో పాటు పలు భద్రతా ఫీచర్లు, క్యూఆర్ కోడు తో ఉంటాయని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పథకం ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధు నాయుడు వార్డు సభ్యులు రావుజి తోడేటి శ్రీనివాస్ గ్రామపంచాయతీ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పిడమర్తి దాసు సుధాకర్ రేషన్ డీలర్ సీతారాం లబ్ధిదారులు పాల్గొన్నారు.

