గార్ల, పెన్ పవర్, ఆగస్టు 24:
వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షిస్తూ గార్ల మండలంలోని కొత్త పోచారం గ్రామంలో మున్నూరు కాపు కులస్తుల ఆధ్వర్యంలో సోమవారం వనభోజనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కులస్తులంతా ఒకచోట చేరి సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ రమ్య నాగార్జున, మున్నూరు కాపు మండల అధ్యక్షులు నరెడ్ల సోమయ్య, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనభోజనాలు వంటి కార్యక్రమాలు కులస్తుల మధ్య ఐక్యతను, ఆత్మీయతను పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని అన్నారు.వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మంచి దిగుబడులు రావాలని, గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మున్నూరు కాపు కులస్తులు ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు అనంతరం సామూహికంగా వనభోజనాలు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి సందడి చేశారు ఈకార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, చౌటం నరేష్, గంధం రవి, పసుపులేటి కొండల్ రావు, పసుపులేటి సుజిత్ నాగార్జున్, తూము మాధవరావు, పింగిలి గణేష్, ముత్యాల రమేష్, ఉపేందర్, పసుపులేటి ప్రదీప్, ఉమేష్, పోలిశెట్టి శివ, పింగళి శ్రీను, గంగారపు భాస్కర్, గణేష్ , భరత్ , సుంకర సైదులు, శ్రీను, తాటికొండ వెంకటేశ్వర్లు, పూర్ణ , మల్లీశెట్టి లక్ష్మి నారాయణ, పెద్దలు, మహిళలు, యువకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

