Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా తులసి దళార్చన భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఉభయదాతలు

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా తులసి దళార్చన భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఉభయదాతలు

 

 

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా తులసి దళార్చన

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఉభయదాతలు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 8:
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించే తులసి దళార్చన సేవ శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. అమ్మవారికి తులసి దళాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించి, విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ పవిత్ర సేవలో ఉభయదాతలు పాల్గొని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తులసి దళార్చన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన తులసి దళార్చన సేవలో పాల్గొన్న ఉభయదాతలు, ఆలయ అర్చకులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular