Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంప్రపంచ తల్లిపాల వారోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, యూనిఫాంల పంపిణీ

ప్రపంచ తల్లిపాల వారోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, యూనిఫాంల పంపిణీ

 

ప్రపంచ తల్లిపాల వారోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ..

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, యూనిఫాంల పంపిణీ

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం,
పెందుర్తి, ఆగస్టు 6 : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 పోస్టర్లను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆవిష్కరించారు.

పెందుర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ నీలవేణి, సబ్బవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ లలిత కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించడం ద్వారా శిశువు ఆరోగ్యవంతంగా ఎదుగుతాడని తెలిపారు. అనంతరం పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వల్ల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అంశాలపై గర్భిణులు, బాలింతల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.

కార్యక్రమంలో భాగంగా పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయడంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు యూనిఫాంలు (చీరలు) అందజేశారు. అలాగే ఎనిమిది నెలల చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించగా, మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులకు ప్రీ-స్కూల్ నమోదు కార్యక్రమంలో భాగంగా స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, యూనిఫాం కిట్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే పోస్టర్లను కూడా విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీమాలతి నగేష్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లి రాము నాయుడు, పీఏసీఎస్ చైర్మన్ సింహాచలం, ఏఎంసీ వైస్ చైర్మన్ గోరపిల్లి సోమనాయుడు, ఏఎంసీ డైరెక్టర్లు, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular