బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెంలో విషాదం
బాపట్ల, సెప్టెంబర్ 24, (పెన్ పవర్) :
బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెగిపడిన విద్యుత్ వైర్ తగిలి తల్లి, కొడుకు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గ్రామానికి చెందిన ముద్రబోయిన రమాదేవి (50), ఆమె కుమారుడు ముద్రబోయిన వెంకటేశ్వర్లు (32) విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు సమాచారం. తెగిపడిన విద్యుత్ వైర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. తల్లి, కొడుకు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

