Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుబిషప్ కె.ఆర్. సింగ్ 71వ జన్మదిన వేడుకలు ఘనం

బిషప్ కె.ఆర్. సింగ్ 71వ జన్మదిన వేడుకలు ఘనం

  • గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 2: స్థానిక నతన్యా చిల్డ్రన్ హోమ్‌లో నాతన్య సంఘాల జాతీయ అధ్యక్షులు బిషప్ కె.ఆర్. సింగ్ అయ్యగారి 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడెంకొత్తవీధి, సీలేరు, చింతపల్లి, కొయ్యూరు, జి.మాడుగుల, ఒడిశా, జముడం తదితర ప్రాంతాల నుంచి పాస్టర్లు, క్రైస్తవ సహోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ జాను బాబు, సురేష్, స్టీవెన్, వైస్ బిషప్ పద్మాకర్ రావు, యాకోబు, సుందర్ రావు, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు వి. తిమోతి తదితరులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిషప్ కె.ఆర్. సింగ్ మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సమాజానికి ఆధ్యాత్మిక సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular