గూడెంకొత్తవీధి,పెన్ పవర్,సెప్టెంబరు 2: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని జీకేవీధిలో వైకాపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వైకాపా మండల అధ్యక్షుడు గిరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జీకేవీధి ఎంపీపీ కుమారి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు చేసిన సేవలు మరపురానివని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు బొబ్బిలి లక్ష్మణ్, అంజి,అరుణ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జీకేవీధిలో వైఎస్సార్ వర్ధంతి నివాళి
RELATED ARTICLES

