గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 24:భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతూ ల్యాండ్‌స్లైడ్‌లు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా పెదవలస–రొంపుల–బొంతువ లస ఘాట్ మార్గం, జీకే వీధి–సీలేరు మార్గాలను గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు మూసివేస్తున్నట్లు జీకే వీధి ఎస్‌ఐ కె. సురేష్ తెలిపారు. మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని, సాధారణ ప్రయాణికులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ఎస్‌ఐ కోరారు.
భారీ వర్షాలు.. ఘాట్ మార్గాలు మూసివేత:ప్రజల భద్రత కోసమే నిర్ణయం: ఎస్‌ఐ సురేష్
RELATED ARTICLES

