*శంఖవరం, పెన్ పవర్ సెప్టెంబర్ 09:-* తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో చివరికి నిజమే గెలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు పర్వత సురేష్ పేర్కొన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన శంఖవరంలో టీడీపీ నేత పర్వత సురేష్ ఆధ్వర్యంలో
టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
చంద్రబాబుపై జరిగిన అరెస్టు రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా పోరాడాయని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడి నిజం కోసం చంద్రబాబు చేసిన పోరాటం చివరకు విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు.
కొవ్వొత్తులు చేతబట్టి నిర్వహించిన కార్యక్రమంలో “నిజం గెలిచింది”, “జై తెలుగుదేశం”, “జై చంద్రబాబు” అంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబుపై అభిమానాన్ని, తెలుగుదేశం పార్టీ పట్ల తమ నిబద్ధతను కార్యకర్తలు ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.
చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ కూటమి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరింతగా అభివృద్ధి చెందుతుందని, భోగాపురం విమానాశ్రయానికి నాంది పలికి, పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధికి తోడ్పడుతున్నారని, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ముందడుగులు వేస్తున్నారని తెలిపారు. ప్రజల విశ్వాసం, కార్యకర్తల ఐక్యత ఉన్నంతకాలం నిజాన్ని ఎవరూ ఓడించలేరని వారు అన్నారు.
శంఖవరం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించారు. కార్యక్రమం సందర్భంగా శంఖవరం ప్రాంతం “జై తెలుగుదేశం” నినాదాలతో మార్మోగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుర్ర వాసు, రౌతు శ్రీను, బుర్ర వరప్రసాద్, పిల్లా గంగాధర్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

