Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిఅర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి

అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి

చింతకాయల పద్మావతి

నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ రెండు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, మందులు, త్రాగునీరు, అత్యవసరమైన వస్తువులు ఇంట్లో ఉంచుకోవాలని అన్నారు. ఈదురు గాలులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు సమీపంలో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్తు అంతరాయం కూడా ఉండే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచన మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సహాయం కోసం అధికారులను గాని స్థానిక నాయకులను గాని సంప్రదించాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular