గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 28:అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకేవీధి జడ్పీటీసీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం నుంచి ఐదు పార్టీల అభ్యర్థులతో పాటు ముగ్గురు స్వతంత్రులు కలిపి మొత్తం ఎనిమిది మంది పోటీలో నిలిచారు.వైఎస్సార్సీపీ నుంచి కంకిపాటి గిరిప్రసాద్, బీజేపీ నుంచి రొబ్బ పుష్పలక్ష్మి, జనసేన నుంచి పాంగి కృష్ణారావు, సీపీఎం నుంచి అంపురంగి బుజ్జిబాబు, బీసీవై నుంచి కిల్లో రంగారావు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా కంకిపాటి మోహనరావు పడాల్, దుక్కేరి ప్రభాకర్, కిముడు అదృష్టరావు బరిలో ఉన్నారు. ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో జీకేవీధి జడ్పీటీసీ ఎన్నికపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
జీకేవీధి జడ్పీటీసీ పోరు రసవత్తరం.. బరిలో ఎనిమిది మంది!
RELATED ARTICLES

