గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 26:రానున్న మూడు రోజుల భారీ వర్షాల నేపథ్యంలో సిబ్బంది హెడ్క్వార్టర్లలో అందుబాటులో ఉండి, ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు, ఎంపీడీవో బి.హెచ్.వి. రమణబాబు ఆదేశించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో, అనంతరం మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకుని, భారీ వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి:తహసీల్దార్ హెచ్ అన్నాజీ రావు
RELATED ARTICLES

