Homeఆంధ్రప్రదేశ్పోలవరంఅవినీతిపై మౌనం వద్దు.. ఏసీబీకి ఫిర్యాదు చేయండి

అవినీతిపై మౌనం వద్దు.. ఏసీబీకి ఫిర్యాదు చేయండి

ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాం: కలెక్టర్ కె. దినేష్ కుమార్

రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 27:

అవినీతిని అరికట్టేందుకు ప్రజలు చైతన్యవంతులై అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా భయపడకుండా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 సందర్భంగా మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అవినీతి వల్ల ప్రజా సేవలకు విఘాతం కలుగుతుందని, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలనకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.

ప్రభుత్వ సేవల కోసం లంచం అడిగినా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిసినా ఏసీబీకి సమాచారం అందించాలని ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎస్. భవ్య కిషోర్ కోరారు. ఫిర్యాదుల కోసం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ కె. గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular