వేటపాలెం, అక్టోబర్ 19 : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నాళం వెంకట రామకృష్ణ , సూర్యకుమారి సహకారంతో నిర్వహించారు. తెప్పోత్సవం సందర్భంగా అమ్మవారి అలంకరణకు అవసరమైన చీరను బాపనపల్లి రూపేశ్వర్ రావు, లక్ష్మి రత్నమాల అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ అధ్యక్షుడు మాజేటి వెంకట సుబ్బారావు, కార్యదర్శి కోడూరి రామకృష్ణ తెలిపారు.
అనంతరం మునుపటి రోజు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలైన బాలబాలికలకు బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు ప్రత్తి ముత్తు కుమరన్ చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

