Homeతెలంగాణసీపీ సజ్జనార్ ను కలిసిన దళిత సంక్షేమ సమితి ప్రతినిధులు

సీపీ సజ్జనార్ ను కలిసిన దళిత సంక్షేమ సమితి ప్రతినిధులు

సీపీ సజ్జనార్ ను కలిసిన దళిత సంక్షేమ సమితి ప్రతినిధులు

ఎల్బీనగర్, పెన్ పవర్, అక్టోబర్ 17:

మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ చెరువు కట్టపై త్వరలో ఏర్పాటు చేయనున్న జాంబవంతుడి విగ్రహానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ ను వారి కార్యాలయంలో దళిత సంక్షేమ సమితి ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. సమితి ప్రతినిధుల వినతిపత్రాన్ని పరిశీలించిన కమిషనర్ సంబంధిత అధికారులతో చర్చించి జాంబవంతుని విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తామని హామీనిచ్చినట్లు సమితి నాయకులు తెలిపారు. కమిషనర్ సజ్జనర్ కు వినతిపత్రం సమర్పించిన వారిలో సమితి ప్రతినిధులు మొక్కపల్లి బాలకృష్ణ, కొండ్ర ఓంప్రకాష్, గజ్జెల రాంచందర్, పోగుల నర్సింహ, జెనిగె నరేష్, చాక శ్రీనివాసులు, దండు యాదయ్య, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular