Homeతెలంగాణఇంటింటా దీపాల కాంతులు

ఇంటింటా దీపాల కాంతులు

అంబరాన్నంటిన సంబరాలు

గార్ల, పెన్ పవర్ ,నవంబర్ :9

దీపావళి మహా పర్వదినం పురస్కరించుకొని  ఆదివారం మండలంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు గార్ల పట్టణ కేంద్రంలోని పలు వ్యాపార సముదాయాలు దీపాల వెలుగుల కాంతులతో కళకళ లాడాయి వ్యాపారస్తులు తమ దుకాణాలు, వ్యాపార సముదాయాలలో వివిధ రకాల దీపాలు వెలిగించి పూల మాలలతో అలంకరించిన దేవతా మండపం వద్ద లక్ష్మీ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు కుటుంబ సమేతంగా మిఠాయిలు పంచిపెట్టి ఆనందం పంచుకున్నారు సాయంత్రం చిన్న పెద్ద తేడా లేకుండా బాణ సంచా దుకాణాల వద్ద. సంతోషంగా టపాసులు కొనుగోలు చేసి. ఆనందోత్సవా లతో రకరకాల టపాసులు తారాజువ్వలు చిచ్చుబుడ్లు వెలిగించి మిరపకాయ బాంబులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు వీధులు మొత్తం దీపాల కాంతులలో టపాసులు మోతలతో మార్మోగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular