Homeఆంధ్రప్రదేశ్జీకే వీధి ఎంపీపీ పీఠం బొబ్బిలి లక్ష్మణ్‌కేనా?

జీకే వీధి ఎంపీపీ పీఠం బొబ్బిలి లక్ష్మణ్‌కేనా?

 

  • • 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 స్థానాలు వైసీపీ కైవసం
  • • దశాబ్ద కాలంగా ఎంపీపీ పదవిపై ఆశలు పెట్టుకున్న లక్ష్మణ్‌కు ఈసారైనా అవకాశం దక్కేనా?

గూడెంకొత్తవీధి, నవంబర్ 8 (పెన్ పవర్): అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకోవడంతో మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం వైసీపీకి దక్కడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఎంపీపీ పదవి ఎవరిని వరించనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత దశాబ్ద కాలంగా ఎంపీపీ పదవిని ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్న బొబ్బిలి లక్ష్మణ్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారి ఆయనకు అవకాశం దక్కుతుందనే ఆశలు అనుచరుల్లో వ్యక్తమవుతున్నాయి.అయితే ఎంపీపీ అభ్యర్థిగా బొబ్బిలి లక్ష్మణ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తుందా? లేక సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మరో కొత్త అభ్యర్థికి అవకాశం కల్పిస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.దశాబ్ద కాలపు నిరీక్షణకు ఈసారైనా తెరపడుతుందా? జీకే వీధి ఎంపీపీ పీఠం బొబ్బిలి లక్ష్మణ్‌ను వరిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular