గూడెంకొత్తవీధి, నవంబర్ 8 (పెన్ పవర్): గూడెంకొత్తవీధి మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఎంపీపీ పీఠం ఆ పార్టీకి దక్కనుంది. ఈ నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా ఎంపీపీ పదవిపై ఆశలు పెట్టుకున్న బొబ్బిలి లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారైనా ఆయనకు అవకాశం దక్కుతుందా? లేక పార్టీ అధిష్ఠానం మరో కొత్త అభ్యర్థికి అవకాశం కల్పిస్తుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

