Homeతెలంగాణహైదరాబాద్డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి: ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సౌజన్య

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి: ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సౌజన్య

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి:ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సౌజన్య

చైతన్యపురిలో తొమ్మిది విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు

ఎల్బీనగర్, పెన్ పవర్  నవంబర్ 27:

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చైతన్యపురి పరిధిలోని తొమ్మిది విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ & స్టేషన్ హౌస్ ఆఫీసర్ సౌజన్య మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాలు, భవిష్యత్తుపై పడే ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాలను సారూర్‌నగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సౌజన్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular